Saturday, 16 March 2024

లింకు క్లిక్ చేస్తే కోట్లు గాయం

 ఈటేటా పెరుగుతున్న సైబర్ మోసాలు మోసపోతున్న వారిలో సిఏలు ఇంజనీర్లు 2023లో 627 కేసులు నాలుగు కోట్లు స్వాహా ఈ రెండు నెలల్లో 213 కేసులు 60 కోట్లు  హాంఫట్ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీస్ అధికారులు


ఏటేటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ ఫారాలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయని రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు వివిధ పద్ధతులు పలు గ్రూపుల లింకుల ద్వారా బాధ్యతలు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్రంలో జరిగిన పలు నేరాల వివరాలను విడుదల చేశారు వివిధ డిజిటల్ వేదికలపై ముఖ్యంగా ఐపీఓ తో ముందస్తు కేటాయింపులు బాగా పెరుగుతాయి అని నమ్మించి పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేస్తున్న కేసులు అనేకం నమోదవుతున్నాయని తెలిపారు ఇలాంటి మోసాల్లో భాగంగా నిరుడు 627 కేసులు నమోదయ్యాయని వాటివల్ల 3.9 కోట్ల వరకు దోపిడీ జరిగిందని పేర్కొన్నారు ఇప్పటికే 20013 కేసులు నమోదు కావడంతో పాటు 27.4 కోట్లను ప్రజలు నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు మోసపూరిత యాప్స్ ను డౌన్లోడ్ చేయించి ఇంటర్ ఫెయిల్ అయిన ఎందరో సైబర్ నేరగాళ్లు విద్యావంతులే టార్గెట్గా లక్ష రూపాయల సొమ్మును దోచుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ పోలీసులు నిర్ధారించార

హైదరాబాద్ నగరంలో కూకట్పల్లికి చెందిన ఒక నగల వ్యాపారి గోల్డ్ మెన్ సాక్స్ బిజినెస్ స్కూల్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేరారు అందులో పెట్టుబడులు పెట్టి ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల పోగొట్టుకున్నారు న్యూ బోయిన్పల్లికి చెందిన ఒక వ్యాపారి 82 స్ట్రాంగ్ స్టాక్స్ అకాడమీ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చేరారు అక్షరాల 67 లక్షల 50 వేల రూపాయలు నష్టపోయారు రాజేంద్రనగర్కు చెందిన ఎయిర్టెల్ రిలయన్స్ క్లబ్, బి1 కేకేఆర్ సీఏ స్టడీయింగ్ వంటి రెండు గ్రూపుల్లో చేరిన సిఏ చదివిన ఒక ప్రైవేటు ఉద్యోగి వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన లింకుతో 50 లక్షల 61,000 నష్టపోయారు కెపిహెచ్బి లోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి స్టాక్ మార్కెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుతో వచ్చిన వాట్సాప్ గ్రూప్ లో చేరి ఒక కోటి 30 వేల రూపాయలు పోగొట్టుకున్నార


సెబీ మార్గదర్శకాలు పాటించాలి.. పోలీసులు..

ప్రజలు పెట్టుబడులు పెట్టే క్రమంలో సెబీ మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు మోసపూరిత లింకులు వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా వస్తున్నాయని ఆ లింకుల ద్వారా ప్రేరేపితమైన మెసేజ్లను నమ్మి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు

1930 కి కాల్ చేయండి అంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏడిజీ షికా గోయల్ గారు

ఆన్లైన్ పెట్టుబడులకు ముందు బాగా ఆలోచించండి సెబీ వంటి నియంత్రణ సంస్థల జాగ్రత్తలు పాటించండి ప్రసిద్ధ స్టాక్ ఎక్స్చేంజి ల నుంచి లైసెన్స్ పొందిన స్టాక్ బ్రోకర్ల ద్వారానే పెట్టుబడును సురక్షితంగా ఉంటాయి ఏదైనా బ్రోకర్ తో పనిచేసే ముందు వారి ట్రాక్ రికార్డును తనిఖీ చేయాలి డిమార్ట్ ఖాతా తెరవకుండానే స్టాక్స్ ట్రేడ్ చేస్తే మీరు డబ్బులు కోల్పోవచ్చు అలాగే డిమార్ట్ ఖాతా లేకుండా అనధికార యాప్లు ఏపీకే ఫైల్స్ యాప్స్ ద్వారా వ్యాపారం చేయడం చాలా ప్రమాదకరం మోసానికి గురైయ్యమని తెలిసిన గంటలోపే 19 30 కి కాల్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి అన్నారు

No comments:

Post a Comment