Sunday, 17 March 2024

ఇహ లోకంలో అహంకారం పనికిరాదు

 ఇహ లోకంలో అహంకారి పనికిరానిదని దేవుడు అన్నిటిని క్షమిస్తాడు కానీ అహంకారాన్ని క్షమించడని అనంతశ్రీ విభజిత్ శ్రీ జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్ర జి మహారాజ్ అన్నారు శనివారం చుక్కల మండలంలోని తెలంగాణ ఉపపీఠంలో సమస్య మార్గదర్శనం దర్శన భాగ్యంతో పాటు ఉపాసక దీక్ష కార్యక్రమంలో పాల్గొని స్వామి అశేష భక్తజన వాహిని ఉద్దేశించి ప్రవచించారు ప్రపంచంలో అన్ని ప్రాణుల కంటే మానవ జీవితం అతి ముఖ్యమైనదని ఇందులో మానవునికి ఆలోచన శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి మానవుడు సన్మార్గాన్ని అవలంబించాలని అన్నారు మంచిని పంచాలని ఇతరుల గురించి నిందలు వేయడం చెడు చేయడం మానుకుని తాము జీవిస్తూ ఇతరులు కూడా తమలాగే జీవించే విధానం విధంగా జీవితాన్ని గడపాలన్నారు ఇహలోక జీవితం శాశ్వతం కాదని పరలోక జీవితం శాశ్వతం కాబట్టి ఈ జన్మలో ఆధ్యాత్మిక చింతన దానధర్మాలు తల్లిదండ్రుల సేవ ఆలయాల్లో గ్రామాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ దుర్వేసనాలకు దూరంగా ఉంటే పుణ్యం ప్రాప్తించి మంచి జన్మ లభిస్తుందన్నారు ఈ సందర్భంగా వేలాదిగా వచ్చిన భక్తులకు ఉచితంగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులను పంపిణీ చేశారు దీంతో పాటు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుండి సైతం వేలాదిక భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు తెలంగాణ ఉపపీఠం సేవాసమితి భక్తులకు అన్నదానం తో పాటు సకల సౌకర్యాలు కల్పించార. స్వామివారి నేడు ఆదివారం సైతం ఉప పీఠంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారని ఇట్టి అవకాశాన్ని రెండవ రోజు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఉపపీఠం సేవా సమితి కోరింది





No comments:

Post a Comment