Wednesday 28 February 2024

తలనొప్పి వాళ్లకే ఎందుకు ఎక్కువ వస్తుంది

 మగవాళ్ళ కంటే మహిళలకి తలనొప్పి మూడు రెట్లు ఎక్కువగా వస్తోందంటోంది అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వే ఒకటి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ తాజా నివేదిక ప్రకారం ఒక నెలలో తీవ్రంగా తక్కువగాను మధ్యస్థంగానో తలనొప్పి ఉందని చెప్పే వాళ్ళలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారంటోంది అంతేకాదు ఈ తలనొప్పికి స్త్రీల రుతుక్రమానికి దగ్గర సంబంధం ఉందని చెబుతోంది మామూలు తలనొప్పిలే కాదు మైగ్రేన్ లాంటి తీవ్రమైన వాటికి ఇదే కారణం అంటోంది అందులోనూ ఈస్ట్రోజన్ హార్మోన్ పాత్ర ఎక్కువటా ఇప్పటిదాకా స్త్రీలు చిన్న విషయాలకి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టే వాళ్లకి ఎక్కువ తలనొప్పులు ఉంటాయని భావిస్తూ వచ్చారు. ఈ అధ్యయనం దాని మూలం ఏంటో చెప్పడానికి ప్రయత్నించింది కానీ మైగ్రేన్ లాగే అనిపించే కొంతకాలం ఉండి మళ్ళీ రాకుండా మరో ఆరు నెలలకు ఏడాదికో కనిపించి వేధించే క్లస్టర్ తలనొప్పి మాత్రం మగవారిలోని ఎక్కువ అని ఇదే సర్వే చెబుతోంది దానికి అయితే ఇప్పటిదాకా స్పష్టమైన కారణం తెలియట్లేదు

No comments:

Post a Comment