Wednesday 28 February 2024

మరో పావుగంట పెంచాల్సిందే

 రోజులో ఎక్కువ సమయం కూర్చునే పనిచేస్తున్నారా అయితే మామూలు కన్నా మీరు మరో పావుగంట ఎక్కువసేపు వ్యాయామం చేయాల్సిందేనట ఉదాహరణకి ఈరోజు 20 నిమిషాలు ఏదైనా వ్యాయామం చేస్తే మంచిదని చెబుతుంటారు కానీ రోజంతా కూర్చుని ఉండేవారు అందరిలా ఆ 20 నిమిషాలకే పరిమితం కాకుండా మరో 15 నిమిషాలు అదనంగా వ్యాయామం చేయాలంటున్నారు పరిశోధకులు దీనిని ఉదయం సాయంత్రం 7 8 నిమిషాలుగా విభజించుకున్న చాలు ఆఫీసులో ఎనిమిది గంటలకు కూర్చుంటే గంటకోసారి లేచి ఒకటి రెండు నిమిషాలు నడిచిన కొంతవరకు ఫలితం ఉంటుందట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కి చెందిన జామా నెట్వర్క్ పత్రిక ఇటీవల ఈ సూచనలు చేసింది శారీరక శ్రమ ఉన్నవాళ్లకన్నా ఎప్పుడూ కూర్చునే ఉండే వాళ్లకి రుద్రోక సమస్య వల్ల 34% ఎక్కువగా ఇతరత్రా వ్యాధుల వల్ల 16% ఎక్కువగా మరణం సంభవించే ప్రమాదం ఉందని ఈ అధ్యాయం చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా సు మారు ఎనిమిది లక్షల మందిని దశాబ్దం పాటు అధ్యయనం చేశాక ఈ హెచ్చరికల్ని జారీ చేసింది ఈ సంస్థ శారీరక శ్రమని పెంచుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తుంది

No comments:

Post a Comment