మొబైల్ కూడా ఆపరేట్ చేయవచ్చు ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇది సులువే మ్యాజిక్ సిక్స్ ప్రో పేరిట ఐ ట్రాకింగ్ టెక్నాలజీ ఫోన్లను తీసుకువచ్చిన హానర్
సెవెంత్ సెన్స్ సినిమా చూశారా ఆ చిత్రంలో విలన్ పాత్రధారి తన కళ్ళతో తీక్షణంగా చూసి ఎదుటివారిని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంటాడు అచ్చం అలాగే కంటితో చూసి కారును డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది వాషింగ్ మెషిన్ ను మొబైల్ ను కూడా కండ్లతోనే ఆపరేట్ చేస్తే బాగుంటుంది కదూ ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇప్పుడు ఇవన్నీ సాధ్యమే ప్రముఖ టెక్ కంపెనీ హానర్ ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో పని చేసే వినూత్న స్మార్ట్ఫోన్ మ్యాజిక్ 6 ప్రో ను తాజాగా తీసుకువచ్చింది బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ మేరకు ఒక ప్రదర్శనను కూడా ఇచ్చింది ఈ క్రమంలో ఐ ట్రాక్ టెక్నాలజీ గురించి సర్వత్ర విస్తృత చర్చ జరుగుతోంది ఇది ఎలా పని చేస్తుంది అంటే ఐ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగించాలంటే ముందుగా ఏదైనా ఫోన్లో దానికి సంబంధించిన యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ క్షణం నుంచి సదర్ ఫోన్ ఐ ట్రాకింగ్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చినట్లే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం ఫోన్ స్క్రీన్ పై కనిపించే రెడ్ బటన్ డినైడ్ కాల్ లేదా గ్రీన్ బటన్ యాక్సెప్ట్ కాల్ వైపునకు చూస్తే చాలు మొబైల్ కెమెరా మనకంటి పాపను విశ్లేషించి మనం ఏ బట్టలు చూసామో దాన్ని ఆన్ చేస్తుంది అంతేకాదు ఫోన్లో ఉన్న మెనూలో ఏ యాప్ తెరవాలి ఏమేం షాపింగ్ చేయాలి, వంటి పనులను కూడా చక్కబెడుతుంది ఫోన్ బ్లూటూత్ తో కారుకు లేదా వాషింగ్ మెషిన్ టీవీ కి అనుసంధానం చేస్తే చాలు ఫోన్ కెమెరా ద్వారా కంటిపాప ఆదేశాలను బట్టి ఆయా డివైస్లను కూడా సులభంగా ఆపరేట్ చేయవచ్చు తాజాగా తీసుకొచ్చిన మ్యాజిక్ సెక్స్ ప్రో స్మార్ట్ ఫోన్లో ఈ ఫీచర్లను అన్నింటినీ పొందుపరిచినట్లు హానర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు
No comments:
Post a Comment