Monday, 26 February 2024

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ తెలిపారు వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఎ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లి స్మార్ట్ అని థీమ్తో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ప్రధానంగా పొదుపు చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు స్లోగన్లు డిజిటల్ సైబర్ భద్రత పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలను రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2కె నడక 28న ఆర్థిక అక్షరాస్యత శిబిరము 29న అన్ని పాఠశాలలు కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యుటి కిరణ్మయి జెడ్పి సీఈవో ఉషా తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment