ప్రసిద్ధ గాయకుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధరశాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది 2023 ఏడాదికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరిచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం గంగాధర శాస్త్రి యథాతకంగా పాడారు అంతేకాదు మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు గతంలో గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారంతో మధ్యప్రదేశ్ లోని మహర్షి పాడిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి అవార్డును ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గంగాధర శాస్త్రి పేర్కొన్నారు అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యాపురేచతో పాటు జూరీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
No comments:
Post a Comment