Thursday, 29 February 2024

ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

 దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయ 60వ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు జడ్పిటిసి తిరుమల గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఆవరణలో సాయంత్రం ఘనంగా చక్రతీర్థం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ సీతారాం మధు సంతోష్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.



దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రేణుకాదేవి అరవైవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం రేణుక ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఘనంగా చక్కెర తీర్థం జాతర జరిగింది రాత్రి 8 గంటల నుంచి శ్రీ సింగరాయపల్లి అంజయ్య శిష్యుల బృందం శ్రీ రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో తీగల తిరుమల గౌడ్ నాని ప్రభాకర్ రెడ్డి ఆశ పోయిన శ్రీనివాస్ కదిరి గోపాల్ రెడ్డి సీతారాం మధు సంతోష్ రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తగారి శిరీష్ గౌడ్ సభ్యులు చిన్న పోష గౌడ్ స్వామి గౌడ్ భక్తులు పాల్గొన్నారు

No comments:

Post a Comment