Wednesday 28 February 2024

ఆ తల్లి పేరు దగ్గులవ్వ

 భక్తులకున్న రకరకాల అవసరాలని బట్టి దేవతలు ఉంటారని మనకు తెలిసిందే వీసాలు ఇప్పించే చిలుకూరు బాలాజీ నుంచి పరీక్షలు పాస్ చేయించే విశాఖ వినాయకుడి దాకా అలా మనకు చాలా గుడులు పేరుొందాయి ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది అందులో కొలువైన దేవత పేరు దగ్గులవ్వ పేరుకు తగినట్లే ఎటువంటి దగ్గు సమస్యలనైనా పోగుడుతుంది అన్నది భక్తుల విశ్వాసం బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కాలనీలో ఉండే ఈ గ్రామ దేవత ఆలయం అతి ప్రాచీనమైనదని అంటారు జలుబు నుంచి నిమోనియా దాకా ఏ సమస్య కారణంగా దగ్గు వచ్చిన ఈ తల్లికి మొక్కుకుంటారు పక్కనే ఉన్న పెన్గంగా నదినీటితో ఈ దేవతని అభిషేకించి దానిని దగ్గు తీర్చే తీర్థంగా తీసుకుంటారు వైద్యంతో అనారోగ్యం తగ్గాక అన్నదానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి ఆషాడంలోనూ పెద్ద ఎత్తున పండగ చేస్తారు బోనాలు ఎత్తుతారు ఈ ఆలయంలో ఈ మధ్య కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైభవంగా ప్రాణ ప్రతిష్ట చేశారు



No comments:

Post a Comment