Wednesday 28 February 2024

నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తించాలి

 ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం ఎన్నో వెబ్సైట్స్ వాడాల్సి వస్తోంది ప్రస్తుతం నకిలీ వెబ్సైట్స్ ఎక్కువైపోయాయి వాటి వల్ల యూజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి నకిలి వెబ్సైట్లను కనిపెట్టడమే అది ఎలాగంటే

వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఆ వెబ్సైట్ కి సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాలి వెబ్సైట్ పేరు చివరలో .com,in,org,edu లాంటిది ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే నకిలీ వెబ్సైట్లో అలా కాకుండా తప్పుగా ఉంటాయి

వెబ్సైట్ పేరులో యు ఆర్ ఎల్ ఉంటే కచ్చితంగా దానికి ముందు హెచ్టిటిపిఎస్ https ఉంటుంది అలా ఉంటే అది ఒరిజినల్ వెబ్సైట్ అలా లేదంటే నకిలీ

వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్సైట్ కి రీ డైరెక్ట్ అవుతుందంటే కచ్చితంగా అది నకిలీ వెబ్సైట్

ఒరిజినల్ వెబ్సైట్లో about us,contact పేజీలు కనిపిస్తాయి నకిలీ వెబ్సైట్లో ఆ వివరాలు ఉండవు

అంతేకాకుండా web of trust అనే వెబ్సైట్ వాడి నకిలీ వెబ్సైట్లను గుర్తించవచ్చు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు ఈ వెబ్సైట్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్ రెడ్ మార్క్ ఉంటే నకిలీ వెబ్సైట్

అనుమానాస్పద లింకులు ఫోన్ నెంబర్లతో వచ్చే మెసేజ్ ల గురించి కంప్లైంట్ చేసేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 8712672222 వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచింది అలాంటి లింక్స్ ఏవైనా వస్తే వాటిని ఈ నెంబర్కు పంపిస్తే వాటిని పరిశీలిస్తుంది నకిలీవని తెలిపే వాటిని పనిచేయకుండా చేస్తుంది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

No comments:

Post a Comment