సదాశివ నగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామంలో శ్రీ ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా బుధవారం సహస్ర ఘటాభిషేకం బోనాల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దొడ్ల రవి తెలిపారు మంగళవారం ముత్తునూరులో మంగళవారం శ్రీ ఖండరాయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంటప పూజ హోమం నిర్వహించారు ఆలయ కమిటీ విడిసి చైర్మన్ దొడ్ల రవి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు
ఘనంగా రేణుక జమదగ్నిల్ల కళ్యాణం భిక్ నూర్ ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం రేణుకా జమదగ్నిల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ఈ నెల 24 నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు ఓడిబియ్యంతో మొ క్కులు చెల్లించుకున్నారు అనంతరం అన్నదానం చేపట్టారు
ఘనంగా బోనాల పండుగ మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రేణుక ఎల్లమ్మ బోనాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు ఊరేగింపు తీశారు గడపగడప నుంచి బోనాలు నైవేద్యాలతో ఆడపడుచులు ఆటపాటలు బ్యాండ్తో శివశక్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో మొక్కులు చెల్లించుకున్నార. కుమార్ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బోనాల ప్రదర్శన ఉత్సవాలను ప్రత్యేక జరుపుతున్నారు గౌడ సంఘం సభ్యులు మోతె రామా గౌడ్ గంగా గౌడ్ రాజా గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
ముత్యంపేటలో ఎల్లమ్మ బోనాలు దోమకొండ మండలం ముత్యంపేటలో మంగళవారం ఎల్లమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శిరీష్ గౌడ్ ప్రతినిధులు పోష గౌడ స్వామి గౌడ్ మోహన్ గౌడ్ సితా గౌడ్ గోపాల్ గౌడ్ నారా గౌడ్ పాల్గొన్నారు
ఆలయ అభివృద్ధికి విరాళము మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి సిరిసిల్లకు చెందిన ఎండ్రాల ముఖ్యం రావు లక్ష్మీ దంపతులు 1,50,000 రూపాయలతో పనులు చేయిస్తామని పేర్కొన్నారు అందులో భాగంగా మంగళవారం 50వేల రూపాయలు ఆలయ నిర్వహణకు అందజేశారు కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ అర్చకుడు పాల్గొన్నార.
ఎల్లారెడ్డి లోని బగలాముఖి పీఠం కాలమానిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం ఆవిష్కరించారు కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకుడు క్రాంతి పటేల్ లక్ష్మీనారాయణ సభ్యులు రేవంతప్ప సతీష్ మధు శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment