Thursday 29 February 2024

హైదరాబాదులో మన యాత్రి యాప్ ప్రారంభం

 హైదరాబాదులో తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ మన యాత్రిని గురువారం టీ హబ్లో ప్రారంభించారు డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యంగా పెట్టుకున్నది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ లో భాగమైన ఈ యాప్ను బెంగళూరులోని నమ్మయాత్ర సాధించిన స్ఫూర్తితో టీ హబ్లో రూపొందించారు ఈ సందర్భంగా ఓఎన్టీసీ సీఈవో టి కోషి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతి ఇక్కడ సాంకేతిక నిపుణులకు మనయాత్రి సరిగ్గా సరిపోతుందని తెలిపారు ఇది సమీకృత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు జస్ట్ పే సంస్థలు చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఎంఎస్ శాన్ మాట్లాడుతూ మనయాత్రి అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని ఇది హైదరాబాదు డ్రైవర్లు పౌరుల జీవితాలను మెరుగుపరిచే ఒక ఉద్యమం అని తెలిపారు మనయాత్ర ఇప్పటికే హైదరాబాదులో 25 వేల మందికి పైగా డ్రైవర్లను చేర్చుకున్నదని తెలిపారు మరో లక్ష మందిని రాబోయే మూడు నెలల్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వెల్లడించారు హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కష్టమైస్ చేసేందుకు టీ హబ్ తో కలిసి పని చేస్తున్నట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు వివరాలకు www.naamyatri.in సంప్రదించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో మహంకాళి శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రతినిధులు డ్రైవర్ల యూనియన్ల సభ్యులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు

No comments:

Post a Comment