దూరం నుంచే గుండెలయ వినొచ్చు. చిన్న లైట్ తో ఇఎన్టి సమస్యలు తెలుసుకునే వీలు ఫిజియోథెరపీ అంచనాకు ఉపయోగపడే ఫిజి డివైస్ శరీరం మనసు సమన్వయాన్ని గుర్తించే యంత్రాలు బయో ఆసియా 2024 లో ఆకట్టుకున్న ఆవిష్కరణలు
రెండు రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న బయో ఆసియా 2024 సదస్సు బుధవారం ముగిసింది ఇందులో భాగంగా నిర్వహించిన ట్రేడ్ ఎక్స్పోలో పలు స్టార్టప్ లు ప్రదర్శించిన ఉత్పత్తులు నూతన ఆవిష్కరణలు అందరినీ ఆకటకున్నాయి వాటిలో కొన్ని
రిమోట్ స్టెతస్కోప్
రోగి హృదయ స్పందనలు డాక్టర్ వినాలంటే ఇద్దరు పక్కపక్కనే ఉండాలి అలా కాకుండా అమీర్పేటలో ఉన్న పేషెంట్ గుండెలైన ఎక్కడో అమెరికాలో ఉన్న డాక్టర్ వినే వీలు కల్పించే స్టెతస్కోపును ఆబో అనే సంస్థ తయారు చేసింది దాని పేరు ఆబో వన్ ఇది పేషెంట్ల గుండెలైన రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేయగలరని రియల్ టైం లోను వినిపించగలరని ఆబో ప్రతినిధులు పేర్కొన్నారు ఈ స్మార్ట్ స్టెత్ ధర 16,500 చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే పేషంట్ల సమస్యను డాక్టర్ ఎక్కడి నుంచి అయినా పర్యవేక్షించడానికి వీలు కల్పించే ఆబోస్కోప్ ను సైతం ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది దీని ధర 9900 అలాగే ఆబో ఎక్స్ సిక్స్ అనే పరికరంతో ఆరు రకాల వైటల్స్ ను ఆబోరింగ్తో నిద్ర ఒత్తిడిని ట్రాక్ చేయడం సాధ్యమవుతుందని ఆబు ప్రతినిధులు చెబుతున్నారు స్లీప్ అప్నియా తదితర సమస్యలున్న వారికి ఉపయోగపడే ఆబోరింగ్ ధర 15 వేల నుంచి 18 వేల రూపాయలు కాక ఆబో ఎక్స్ సిక్స్ ధర 18,900
ఫిజి యోథెరపీ అసెస్మెంట్ కు ఫిజీ
ఫిజియోథెరపీకి ఇటీవల కాలంలో ప్రాముఖ్యం బాగా పెరిగింది ఈ నేపథ్యంలో ఏ తరహా సమస్యకు ఏ తరహా తెరపి అయితే సరిపోతుందో తెలిపే ఫిజి అనే డివైస్ ను స్టార్టోన్ ల్యాబ్స్ తయారు చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫిజియోథెరపీ టూల్ కిట్ ఇది మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ తో దీనిని కనెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నివేదికలను పొందవచ్చు న్యూరోలాజికల్ వెన్నెముక సమస్యల బాధితులకు ఆటలాడుతూ గాయాల పాలైన వారికి పెద్ద వయసులో వచ్చే సమస్యలకు ఇది బాగా తోడ్పడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు
ఏకాగ్రతను కొలుస్తుంది ఏ పని చేయడానికి అయినా ఏకాగ్రత ముఖ్యం కానీ ఆ ఏకాగ్రతను సాధించడమే కష్టం. శరీరానికి మనసుకు మధ్య సమన్వయం లేకపోవడం దీనికి కారణం రూపొందించిన సిసిటిఏ కాన్సన్ట్రేషన్ అండ్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ టు శరీరానికి మనసుకు మధ్య సమన్వయం కల్పించడంలో తోడ్పడుతుందని కోయక్సిన్ టెక్నాలజీ సంస్థ చెబుతోంది బాధపడే వారికి లర్నింగ్ డిజేబులిటీ ఆర్టిజం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు దీనితో వ్యక్తులలో ఆత్మవిశ్వాసం పెరిగి ఏకాగ్రత మెరుగుపడుతుందని మెదడుకు చేతికి సమన్వయం బ్రెయిన్ హ్యాండ్ కూడా పెరుగుతుందని చెప్పారు
No comments:
Post a Comment