Sunday, 25 February 2024

ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి

 ఒక్కసారి మీ ఎల్ఐసి పాలసీ గడవు తీరిపోతే మెచ్యూరిటీ నగదు మొత్తాన్ని తీసుకోవలసి ఉంటుంది .అయితే కస్టమర్లు ఎందుకోసం క్లెయిమ్ చేసుకోవాలి .ఆన్లైన్లోనూ ఈ మెచ్యూరిటీ క్లెయిమ్ను దాఖలు చేయవచ్చు ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ ద్వారా ఇన్దుకు వీలున్నది.

 పాలసీదారులు ఏం చేయాలంటే ..

ముందుగా పాలసీదారులు తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వరంగ భీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచిస్తుంది. అలాగే పాలసీ సొమ్మును పొందేందుకు కేవైసీ ని కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.

 ఎండోమెంట్ మెచ్యూరిటీ క్లెయిమ్స్..

 ఎండోమెంట్ పాలసీలు గడవు తీరిన తర్వాత చెల్లింపులు జరుగుతాయి. ఈ మేరకు పాలసీ వ్యవధి పూర్తవడానికి కనీసం రెండు నెలల ముందు అయినా సంస్థ తమ కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. కావాల్సిన పత్రాలను సమర్పిస్తే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ అవుతుంది. పూర్తయిన డిశ్చార్జి ఫామ్, పాలసీ డాక్యుమెంట్, నెఫ్ట్ ఫార్మ్, కేవైసీ వంటివి అవసరము .

మనీ బ్యాక్ పాలసీలలో..

 ఐదు లక్షల రూపాయల దాకా మొత్తాల చెల్లింపులకు పాలసీ డాక్యుమెంట్తో పనిలేదు .జీవనా నంద్ ప్లాన్ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా పాలసీ బాండ్ల అవసరం లేదు. ఈ రకమైన పాలసీలలో పాలసీ వ్యవధి మొత్తంగా నగదు భరోసా ఉంటుంది. కాలానుగున చెల్లింపులు  ఉంటాయి.

డెత్ క్రైమ్ లు ..

బకాయిలు లేకుండా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వ్యవధిలోనే మరణం సంభవించాలి .అలాగే క్లైమ్ ఫామ్ ఎల్లో క్లెయిమ్ చేస్తున్నవారు మృతుల వివరాలన్నింటినీ పేర్కొనాలి .డెత్ సర్టిఫికెట్ను సమర్పించాలి .ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. ఒకవేళ పాలసీదారు ని వయస్సు పేర్కొనకపోతే ఏజ్ సర్టిఫికెట్ అవసరము . రిస్క్ లేదా పాలసీ పునరుద్ధరణ జరిగిన మూడేళ్ల లోపు మరణం సంభవిస్తే క్లైమ్ ఫామ్ బి అవసరము. ఇందులో పాలసీదారుడు చనిపోయిన చివరి రోజులలో వారికి సేవలందించిన వారి ద్వారా మెడికల్ అటెండెన్స్ సర్టిఫికెట్ని ఇవ్వాలి .దవాఖానాలో చికిత్స తీసుకుంటే క్లెయిమ్ ఫామ్ బి వన్ అవసరము. ఆఖరి రోజుల్లో చికిత్సలు అందించిన వైద్యుడు చె క్లెయిమ్ఫా ఫామ్ బి టు తీసుకోవాలి. తెలిసిన వారిచే గుర్తింపు అంత్యక్రియలకు సంబంధించి క్లీన్ ఫామ్ సీ నీ ఇవ్వాల్సి ఉంటుంది .చనిపోయిన పాలసీ దారుడు ఉద్యోగి అయితే వారి సంస్థ చేత క్లెయిమ్ ఫామ్  ఈ నీ ఇప్పించాలి.

No comments:

Post a Comment