Wednesday 28 February 2024

హెల్త్ టిప్స్ 28-2-2024

 వాల్ నట్స్ తో కొత్త శక్తి

పిల్లలకు ఏం పెట్టాలనే విషయంలో కన్నవారికి ఎప్పుడూ గందరగోళమే చిన్నారుల ఆహారంలో వాల్నట్స్ చేరిస్తే మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది పిల్లల శరీరం మెదడుకు కావాల్సినంత శక్తిని సమకూరుస్తాయి వీటిలో ఒమేగాత్రి ఫ్యాటీ ఆమ్లాలు ప్రోటీన్లు ఫైబర్ పుష్కలం దీంతో పిల్లలు చురుగ్గా బలంగా సంతోషంగా ఉంటారు మిగిలిన వారితో పోలిస్తే వారంలో కనీసం మూడుసార్లు వాల్నట్స్ తిన్న పిల్లల జ్ఞాపకశక్తి జాగరుకత పెరిగాయని ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది వాల్నట్స్లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే ఒక రకం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లం మెదడు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు అవసరం మరీ ఎక్కువ ఈ సమయంలో పిల్లల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అయితే పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలని విషయంలో డాక్టర్ల సలహా తప్పనిసరి వాల్నట్స్ అలర్జీ లేకపోతే మాత్రం పిల్లలకు ఇది ఒక సూపర్ ఫుడ్

తల్లుల ఆందోళన పిల్లలకు

గర్భణులు కొంగుబాటుకు గురైతే ఆ ఒత్తిడి అంతా పుట్టబోయే పిల్లలకు బదిలీ అవుతుందట దీనికి సంబంధించి బెంగళూరు చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ స్టడీ ఒక పరిశోధన నిర్వహించింది 2016లో మొదలైన ఈ అధ్యయనం తాజాగా ముగిసింది బెంగళూరులోని వివిధ ప్రభుత్వ వైద్యశాలలో పేర్లు నమోదు చేసుకున్న 912 మంది గర్భిణులపై ఈ పరీక్షలు జరిపారు కొంగుబాటు ఉన్న గర్భిణులకు పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారట గృహహింస పరోక్ష దుమపానం కూడా గర్భిణీలో పిల్లల మీద దుష్ప్రభావం చూపుతాయట వీటి వల్ల ముందస్తుప్రసాదాలు పిల్లలు ప్రవర్తన సమస్యలు తలెత్తయటం ప్రసవానికి ముందు ఆ తర్వాత కూడా ఇంటి వాతావరణం గర్భిణుల మీద ప్రభావం చూపుతుందని అధ్యయనం తెలిపింది కాబోయే తల్లికి ఇంటా బయట స్నేహపూర్వక వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనదే

క్యాన్సర్ కు ఏరోబిక్స్ తో చెక

ప్రింటింగ్ రోయింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాల వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వ్యాయామంతో మన శరీర అవయవాలు మరింత గ్లూకోస్ ను వినియోగించుకుంటాయి కణాల్లో శక్తికి ప్రధాన వనరు గ్లూకోజ్ అనే విషయం తెలిసింది దీంతో వ్యాయామం చేసే వాళ్ళలో వ్యాధి వృద్ధి చెందుతున్న దశలో క్యాన్సర్ కణాలు వ్యాపించడానికి అవసరమైన గ్లూకోజ్ అందుబాటులో ఉండదు అటే క్యాన్సర్ కణాలు ఇతర వాళ్లకు వ్యాపించే అవకాశం తక్కువ అన్నమాట

No comments:

Post a Comment