Sunday 25 February 2024

రేషన్ కార్డు ఈ కేవైసీ ఈనెలాఖరుతో ముగుస్తున్న గడువు

 రేషన్ కార్డుకు ఈ కేవైసీ గడవు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది ఇప్పటికే గడువును రెండు మార్లు పొడిగించిన ఆశించిన స్పందన రావడం లేదు ఈ కేవైసీ చేయించడంలో తీవ్ర జాప్యం కలుగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులలో కేవలం 5% మంది లబ్ధిదారులు మాత్రమే చేయించుకున్నారు మిగతావారు ఆధార్ అప్డేట్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో కలిపి 78.84 శాతం మంది ఈ కేవైసీ నమోదు పూర్తయినది ఇంకా నాలుగు లక్షల 5379 మంది చేయించుకోవలసి ఉంది

బియ్యం సరఫరా నిలిచిపోతుంది రేషన్ కార్డుకు ఈ కేవైసీ పూర్తి చేయించుకోకుంటే బియ్యం సరఫరా నిలిచిపోనున్నది రేషన్ కార్డులో పేర్లు నమోదయి ఉన్న లబ్ధిదారులు అసలైనవారా లేదా అనేది తెలుసుకోవడానికి కేంద్రం ఈ ప్రక్రియ చేపట్టినది ఉమ్మడి జిల్లాలో 60 శాతం ఈ కేవైసీ నెల రోజుల్లోనే పూర్తయింది మిగతా 18 శాతం పూర్తికావడానికి సుమారు రెండు నెలల సమయం పట్టింది చాలామంది ఆధార్ నవీకరించుకోకపోవడం చిన్నారుల వేలిముద్రలను అప్పుడే చేయించుకోకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది 

మరో నెల సమయం ఇస్తేనే..

 చాలామంది అర్హులు ఈ కేవైసీ నమోదు చేయించుకోలేకపోతున్నారు ఇప్పటికే రెండు మార్లు గడువు పెంచిన ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పెంచితే నమోదు శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది కొన్ని చోట్ల రేషన్ డీలర్లు అందుబాటులో లేక ప్రక్రియ నిమ్మదిస్తోంది ఈ కేవైసీ నమోదు కోసం డీలర్లు వారి దుకాణాల్లో ఉదయం సాయంత్రం కొంత సమయం కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు

No comments:

Post a Comment