Thursday, 29 February 2024

స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు

 సివిల్ లేదా క్రిమినల్ కేసులలో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసి స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతా అదే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది రాజ్యాంగ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు హైకోర్టులు సాధారణంగా కింది కోర్టులో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివైచంద్ర చూడు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణలను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది కేసుల విచారణకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్లో ఉన్నాయో అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమం అని వివరించింది 2018 లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టేట్ ఉత్తర్వులు ప్రత్యేకంగా పొడిగించకపోతే వాటి అంతటావే రద్దు అవుతాయని త్రిసభ్య ధర్మసనం అప్పట్లో తీర్పు చెప్పింది స్టే ఆర్డర్ మంజూరైన తర్వాత ఆరు నెలలు ముగిసిన అనంతరం విచారణ లేదా ప్రొసీడింగ్స్ నిలిచిపోవాలని తెలిపింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చే స్టే ఆర్డర్ కు ఇది వర్తించదని వివరించండి ఈ తీర్పుతో ఏకీభవించేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది

No comments:

Post a Comment