Tuesday, 27 February 2024

6న ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పరీక్ష

 సికింద్రాబాద్లోని బోయిన్పల్లి లో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం మార్చే ఆరో తేదీన జిల్లాస్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి ఆరో తేదీన జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిజికల్ టెస్టులతో పాటు వయస్సు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎంపికైన వారికి మార్చి 21న హైదరాబాద్లోని ఐకింపేట స్పోర్ట్స్ స్కూల్లో ఎంపిక పరీక్ష ఉంటుందని తెలిపారు ఆసక్తిగల తొమ్మిది నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులు ఎంపిక పరీక్షలకు హాజరుకావాలని ఇతర వివరాలకు కలెక్టరేట్లను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు

No comments:

Post a Comment