Thursday 29 February 2024

పులగం ఎలా చేయాలి

 బియ్యం ఒక కప్పు పెసరపప్పు అరకప్పు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిర్చి ఆరు మిరియాలు అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున పసుపు పావు టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెబ్బలు ఉప్పు తగినంత

బియ్యం పెసరపప్పు కడిగి విడివిడిగా గంటసేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మిరియాలు తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి బాగా వేగాక పసుపు కలపాలి నానబెట్టిన పెసరపప్పు బియ్యం తగినంత ఉప్పు జోడించి రెండు నిమిషాలు బాగా కలిపి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే నోరూరించే పులగం సిద్ధమవుతుంది

No comments:

Post a Comment