ప్రస్తుతం అందరూ ఆన్లైన్ షాపింగ్ కి అలవాటయ్యారు దుస్తులు చెప్పులు టీవీలు ఫ్రిజ్లు బహుమతులు మందులు కిరాణా సరుకులు కూరగాయలు ఇలా ఒకటేమిటి చివరికి గుండుసూది కావాలన్న తక్షణమే ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు అయితే వీటికి లాగే ఇకపై ఇల్లు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది జోక్ ఎంత మాత్రం కాదు ఆన్లైన్లో అలా ఆర్డర్ చేయగానే ఇలా వచ్చేస్తుంది కేవలం 21 లక్షల రూపాయలకే ఇల్లు సొంతం చేసుకోండి అంటూ ఒక ఈ కామర్స్ సంస్థ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తుంది 16.5 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏమిటో తెలుసా ఫోల్డ్ చేయడం షవర్ టాయిలెట్ కిచెన్ లివింగ్ ఏరియా బెడ్ రూమ్ అంటే సకల సౌకర్యాలు ఈ ఇంట్లో ఉండడం విశేషం ఒకవేళ వేరే చోటుకి వెళ్లాల్సి వస్తే గనుక చక్కగా మడత పెట్టి దీనిని కూడా వెంట తీసుకొని వెళ్లొచ్చట అమెరికాకు చెందిన జెఫ్రీ బ్రాండ్ అనే టిక్ టాక్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకోగా అది కాస్త వైరల్ గా మారింది నానాటికి పెరిగిపోతున్న అద్దెలు ఇళ్ల ధరలకు ఈ మడత పెట్టే ఇల్లు హౌస్ మంచి ప్రత్యామ్నాయంగా మారబోతోందంటూ నేటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు
No comments:
Post a Comment