నేలపై నడిచే నింగిలో ఎగిరే సరికొత్త కారు 2025 చివరి నాటికి అందుబాటులోకి ట్రాఫిక్ జామ్ కష్టాలను తీర్చేందుకు త్వరలో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి రాబోతోంది దాదాపు రెండు లక్షల 35వేల పౌండ్లు అంటే రెండు కోట్ల 46 లక్షల రూపాయలకు లభ్యమయ్యే ఈ కారు సహాయంతో మీరు సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మాదిరిగా విమానంలో ఎగురుతూ ట్రాఫిక్ జాముల నుంచి సులువుగా బయటపడవచ్చు సంస్థ రూపొందించిన ఈ ఫ్లైయింగ్ కారుకు మాడలియే అని నామకరణం చేశారు మామూలు కారుల మాదిరిగా వీధులలో రోడ్లపై నడవడంతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెక్ ఆఫ్ తీసుకొని నింగిలో ఎటువైపున ప్రయాణించగలడం దీని ప్రత్యేకత రెండు సీట్లతో చాలా తక్కువ బరువు ఉండే ఈ కారు సింగిల్ చార్జింగ్తో రోడ్డుపై దాదాపు 200 మైళ్ళు అంటే 321 కిలోమీటర్లు గాలిలో ఒక వంద పది మైళ్ళు అంటే ఒక 1007 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ కారులను 2025 చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ చీఫ్ ప్రకటించారు
No comments:
Post a Comment