Thursday 29 February 2024

శ్వేత ప్రసాద్కు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుని శ్వేతా ప్రసాద్ 2022 23 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారకు ఎంపికయ్యారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది సంగీత విభాగం కర్ణాటక మ్యూజిక్ లో తెలంగాణ నుంచి శ్వేతా ప్రసాదం ఎంపిక చేశారు శ్వేతా ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా 2 వేలకు పైగా గాత్ర ప్రదర్శనలు నిర్వహించారు అన్నమాచార్య కృతులు త్యాగరాజ కీర్తనలతో ప్రదర్శనలు ఇచ్చారు దేశ విదేశాలలో భరతనాట్యము ఆంధ్ర నాట్యము కూచిపూడి విభాగాలలో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్రము నట్టువాంగా సహకారం అందించారు పలు నృత్య ప్రదర్శనలకు స్వర కల్పన చేశారు అమెరికా చైనా మలేషియా టర్కీ సిరియా వియత్నాం దేశాలలో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు

ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవారాలైన శ్వేతా ప్రసాద్ నాలుగేళ్ల ప్రాయంలోనే సంగీతం అభ్యసించారు కర్ణాటక ఓకల్ , లలిత సంగీతంలో ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారుని ఆయన శ్వేతా ప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీ చేస్తున్నారు

No comments:

Post a Comment