అయోధ్యలోని హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇకనుండి భక్తుల ఇంటికి నేరుగా చేరనున్నది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ బాగా పెరిగింది దీనితో చాలా మంది భక్తులకు అనుమానం గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్మాస్టర్ అయోధ్యర్ధం 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి
ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగరాజు వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ జనరల్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయి మనీ ఆర్డర్ కు లడ్డూలు హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు
No comments:
Post a Comment