ఈనెల 25 వరకు ఎంట్రీలకు కేంద్ర హోం శాఖ ఆహ్వానం
సైబర్ నేరాల కట్టడికి అవగాహనని అస్త్రంగా ప్రయోగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ ఫోర్ సి ఆధ్వర్యంలో సైబర్ సేఫ్ ఇండియా అన్న ఇతివృత్తంతో సైబర్ క్రైమ్ అవగాహన స్ట్రీట్ ప్లే పోటీలను నిర్వహిస్తోంది ఆసక్తి ఉన్నవారి నుంచి ఎంట్రీలో ఆహ్వానిస్తోంది ఎంట్రీలు పంపేందుకు ఫిబ్రవరి 25 చివరి తేదీ అని అధికారులు తెలిపారు https://www.mygov.in/task/cyber& awareness&street&play&contest/ లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ టైం జాబ్స్ పేరిట సైబర్ మోసాలు అనధికారిక లోన్ యాప్స్ మోసాలు సెక్టార్షన్ పార్సిల్ స్కామ్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ఆధారితమోసాలు చిన్నారులు మహిళలపై సైబర్ వేధింపులు అనే అంశాలపై 15 నిమిషాలకు మించకుండా స్ట్రీట్ ప్లేను తీసి అప్లోడ్ చేయాలని సూచించారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి