Wednesday, 21 February 2024

అమ్మో వాయిస్ క్లోనింగ్

 డీప్ ఫేక్ వీడియోల కలకలం ఒకవైపు కొనసాగుతుండగాని వాయిస్ క్లోనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి .ఇప్పటికే అమెరికా ఐరోపా దేశాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ వాయిస్ ని సృష్టించడమే వాయిస్ క్లోనింగ్ గా నిపుణులు చెప్తున్నారు. నకిలీ వాయిస్ తో ఆర్థిక నేరాలకు పాల్పడడమే దీని ఉద్దేశమని వెల్లడిస్తున్నారు .ఎలా మభ్యపెడతారంటే.. లక్షత వ్యక్తికి సంబంధించిన వాయిస్ ను తోలుతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తర్ఫీదు ,ట్రైన్ చేసి చేసి అసలు వాయిస్ గా భ్రమించేలా క్లోనింగ్ చేస్తారు తర్వాత సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఆప్తుల ఫోన్ నెంబర్లకు కాల్స్ చేసి ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా ఫేక్ సంభాషణలను కొనసాగిస్తారు ఆపదలో ఉన్నాం వెంటనే ఈ నెంబర్కు డబ్బులు పంపించాలంటూ విజ్ఞప్తి చేస్తారు డబ్బులు పంపించే వరకు పలు విధాలుగా మభ్యపెడతారు ఆత్మీయ లే ఫోన్ చేశారు కదా అంటూ అలా పలువురు పెద్ద మొత్తంలో డబ్బు పంపించిన ఉదంతాలు అమెరికాతో పాటు ఇప్పటికే పలు దేశాల్లో  వెలుగు చూశాయి కూడా. అమెరికాలోని ఓ కంపెనీకి చెందిన సీఈవో ఇలా మోసపోయి ఏకంగా రెండు లక్షల 43 వేల డాలర్లను నీరగాళ్లకు పంపించినట్లు సమాచారం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు కూడా వాయిస్ క్లోనింగ్ సెగ ఇటీవల తగిలింది ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు బయడేన్ చెప్పినట్లుగా ముందుగా రికార్డ్ చేసిన కొన్ని ఫేక్ ఫోన్ కాల్స్ పలుగురికి వెళ్లాయి ఎన్నికల్లో ఓటు వేయొద్దని బయడిన్ఓటర్లను కోరినట్లు ఆడియోలో ఉన్నది .కృత్రిమ మేధా ఆధారంగా సృష్టించిన ఈ ఫేక్ కాల్స్ పై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది వాయిస్ క్లోనింగ్ నేరాల పట్ల క్లోనింగ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment