ప్రారంభం వచ్చే నెలలో సేవలు ప్రారంభం
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఈ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా హనుమాన్ పేరుతో సీతామహాలక్ష్మి హెల్త్ కేర్ సంస్థ ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆవిష్కరించింది ఏకంగా 22 భారతీయ భాషల్లో ఆరోగ్య సంరక్షణ పరిపాలన విద్య ఆర్థిక సేవలు తదితర రంగాలకు సంబంధించిన సేవలను అందించగలిగే ఈ ఎల్ ఎల్ ఎం ను బాంబే ఐఐటి నేతృత్వంలోని భారత జిపిటి ఎకో సిస్టం భాగస్వామ్యంతో ఆవిష్కరించారు . బాంబే ఐఐటీ తో పాటు మరో ఏడు ఇతర ఐఐటీ ల ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జిపిటి ఎకో సిస్టమ్ వాస్తవానికి ఒక రీసెర్చ్ కన్సార్టియం. ప్రముఖ పరిశ్రమికవేత్త ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఎస్ ఎం ఎల్ తోడ్పాటుతో ముందుకు సాగుతున్న ఈ కన్సార్టియం చాట్ జిపిటి తరహాలో సేవలందించే భారత్ జీపీటీ వచ్చే నెలలో ప్రారంభించనున్నది . స్పీచ్ టు టెక్స్ట్ ,టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ టు వీడియో, వీడియో టు టెక్స్ట్ జనరేటింగ్ లాంటి బహుళ సామర్థ్యాలను కలిగి ఉన్న హనుమాన్ ఎల్.ఎల్.ఎమ్ ప్రస్తుతానికి హిందీ తమిళ్ తెలుగు మలయాళం మరాఠీ తదితర 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందిస్తుంది మునుముందు 22 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగలిగేలా సామర్థన్ని పెంచాలని భావిస్తున్నారు
No comments:
Post a Comment