జపాన్ లో వచ్చే నెల నుంచి ప్రారంభం
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రోబోల వినియోగం పెరుగుతున్నది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబేర్ ఈట్స్ వచ్చే నెల నుంచి జపాన్ లోని టోక్యోలో రోబోలతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నది. ఇన్దుదుకోసం మిత్సుబిషి ఎలక్ట్రిక్ అండ్ కార్ట్ కెన్ తో ఒప్పందం కుదూర్చుకుంది. ఈ అటానమస్ సైడ్ వాక్ రోబోలను కార్ట్ కెన్ కు చెందిన మోడల్ సి నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో రోబోలతో ఫుడ్ డెలివరీ చేయించడం ఇదే తొలిసారి కానున్నది నిజానికి జపాన్లో రోబోలవాడకం కొత్తేమీ కాదు ఏళ్ల తరబడి ఇక్కడ రెస్టారెంట్లు ఇది సేవలందిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి వీధుల్లో ఫుడ్ డెలివరీ చేస్తూ కనిపించడమే కొత్త వింత కాబోతున్నది ఫుడ్ డెలివరీ చేసే ఈ రోబోలు పాద చారులు నడిచే దారిని ఎంచుకుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్ ను పాటిస్తాయి. ఇది నడుచుకుంటూ వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఆహారం చల్లారిపోదా. అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ సమస్యకు పరిష్కారంగా కార్గో బిన్ ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం వీటిలో ఆహారం సరఫరా చేస్తే అప్పుడు వండినట్లుగానే ఉంటుందట
No comments:
Post a Comment