సరికొత్త సైబర్స్ కం తెరపైకి తెచ్చిన నేరగాళ్లు రోజువారీగా లాభాలు పొందచ్చని గాలం తస్మాత్ జాగ్రత్త అంటున్న సైబర్ భద్రత నిపుణులు
ప్రజల అత్యాశ అమాయకత్వమే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త తరహా నేరానికి తెర తీస్తున్నారు తాజాగా ఆవులు దత్తత తీసుకోండి రోజు లాభాలు పొందండి అంటూ ఇంటర్నెట్లు ఊదరగొడుతున్నారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు ఇది సరికొత్త రూపంగా సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు ఈ స్కామ్ లో పలు రకాల ఆవులకు కొంత మొత్తం ధర చెబుతారు ఆ మొత్తాన్ని చెల్లిస్తే చెల్లించిన మొత్తానికి కొంత లాభాన్ని తిరిగి ఇస్తారు ఇలా పెట్టిన పెట్టుబడికి లాభం పొందవచ్చు అదేవిధంగా ఈ స్కీమ్లో మరో ముగ్గురిని సిఫారసు చేస్తే వినియోగదారిటీ ఖాతాలో కొంత గుడ్విల్ మొత్తం వేస్తారు ఇలా ఒకరి ద్వారా చేర్చిన ముగ్గురు మరో ముగ్గురు చొప్పున చేర్చిన ప్రతిసారి వినియోగదారులకు వచ్చే లాభం పెరుగుతుందని ఆశలు కల్పిస్తారు గతంలో ఇతరహా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు ఎన్నో తెలుగులోకి వచ్చాయి అయితే ఇది కొత్త తరహాగా ఉండటంతో ప్రజలు వీటిని నమ్మి మోసపోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని ఆసక్తి ఉన్నవారిని ఈ సైబర్ మోసగాళ్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు
ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న మోసాలు ప్రధానంగా ఈ తరహాలో మోసాలకు వరల్డ్ ఫామ్ వరల్డ్ ఫామ్ ప్రో వరల్డ్ ఫామ్ రాంచి గోల్డ్ పేరిట ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్లు యాప్ ల గురించి యాడ్స్ ఇస్తున్నారు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ యాప్లు నిజమైనవే నన్ను నమ్మించేలా నక్కిలి డౌన్లోడ్లు రివ్యూలను సైతం ఆయా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయని యూట్యూబ్లలో ప్రమోషన్ పేరిట ఫేక్ స్టోరీలను పెడుతున్నట్లు సైబర్ భద్రతా నిపుణులు పేర్కొన్నారు ఇలాంటి యాప్లను డౌన్లోడ్ చేసుకున్న వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్న తర్వాత మోసానికి తిరతిస్తున్నారు మొదట ఖాతాలోకి లాభాలను జమ చేస్తారు అనంతరం రివార్డ్ పాయింట్లు మానిటరి బెనిఫిట్ల పేరిట ఖాదర్లో డబ్బు జవు జమ అవుతున్నట్లుగా యాప్ లో చూపుతున్నారు అయితే ఖాతాదారుడికి డ్రా చేసుకునే అవకాశం ఇవ్వరు చి వరకు కమిషన్ తీసుకొని లాభాలు చెల్లించే పేరిట భారీగా డబ్బులు లాగి ఆ తర్వాత యాప్ అందుబాటులో లేకుండా చేస్తున్నారు
అత్యాశకు పోయి మోసపోవద్దు. సైబర్ నేరగాళ్లు తేలిగ్గా డబ్బు సంపాదించాలన్న మన బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు తెరచిస్తున్నారు ఆవుల దత్తత మోసాలు గతంలో మనం చూసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటిది తేలిక లాభాలు రావడం అంటేనే మోసమని గ్రహించాలి గుర్తింపు లేని ఎటువంటి యాప్లను డౌన్లోడ్ చేసి డబ్బులు చెల్లించవద్దు ఇతరహా మోసాల బారిన పడకుండా ప్రజల అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ ప్రసాద్ పాటి బండ్ల సైబర్ ఇంటలిజెన్స్ నిపుణుడు న్యూఢిల్లీ వారు తెలియజేస్తున్నారు
No comments:
Post a Comment