28, సెప్టెంబర్ 2026, సోమవారం

ఉచిత శిక్షణ @మద్నూర్, 9247540478

 కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో నిరుద్యోగ యువత, మహిళలకు వివిధ ఉపాధులపై ఆరు రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏ పీ ఎం జగదీశ్ తెలిపారు. సోమవారం మద్నూర్ లో శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణ మండలంలోని నిరుద్యోగులు, మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు సంస్థ ప్రతినిధి సూర్యతేజ మాట్లాడుతూ .. శిక్షణ లో ఫాబ్రిక్, పెయింటింగ్ మెలకువలు నేర్పించనున్నామని తెలిపారు. శిక్షణ తీసుకోవాలనుకుంటే నసురుల్లాబాద్ లోని ఆర్ ఎస్ ఈ టీ ఐ కార్యాలయాన్ని సంప్రదించి శిక్షణ కోర్సులకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలనుకున్నారు. 

పూర్తి సమగ్ర వివరాలకు 9247540478 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి