Sunday, 3 March 2024

జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం

 విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి రమేష్ చందు అన్నారు మండలంలోని కుప్రియల్ గ్రామ శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు బాల్య వివాహాలు మానవక్రమ రవాణా సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న సమస్యలు మాదకద్రవ్యాల వినియోగము విద్య హక్కు గృహహింస నిరోధక ఫోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులకు సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 19301098181 కు కాల్ చేయాలని అన్నారు సమావేశంలో ప్రిన్సిపాల్ రా గిణి ఐ ఎస్ ఆర్ డి సంస్థ ప్రతినిధి అమృత రాజేందర్ రావు అర్ల విట్టల్ రావు సంతోష్ అధ్యాపకులు పుష్పలత శ్రావణి మాధురి కవిత సింధుశ్రీ స్వప్న సుజాత తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment