Thursday, 14 March 2024

సుప్రీమ్ ప్రశంస

 వంట మనిషి కుమార్తెకు సుప్రీంకోర్టు జడ్జిల్లా సత్కారం

హృదయాలను కదిలించే అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది కోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ సమాల్ అనే వ్యక్తి కుమార్తె యువ న్యాయవాది ప్రగ్యా కు అమెరికాలోని కాలిఫోర్నియా మిర్చి గాని యూనివర్సిటీలలో ఉపకార వేతనంతో న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది దీనితో బుధవారం ఉదయం కోర్టు ప్రారంభమయ్యే ముందు జడ్జీల లాంజీలు సిజెఐ జస్టిస్ డివైస్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ సమావేశమై కరతాల ధ్వనులతో ప్రజ్ఞాను అభినందించారు ఆమె తల్లిదండ్రులను సన్మానించారు ఈ సందర్భంగా జస్టిస్ డివై చంద్ర చూడు మాట్లాడుతూ దేశానికి సేవలందించేందుకు ప్రగ్యా మళ్ళీ భారత్కు తిరిగి వస్తుందని విశ్వసిస్తున్నామన్నారు రాజ్యాంగం పై రాసిన మూడు పుస్తకాల పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ సంతకాలు చేసే ఆమెకు బహుకరించారు



No comments:

Post a Comment