Sunday, 3 March 2024

గరం మసాలా ఎలా చేయాలి

 పనీర్ టమాటో బంగాళదుంప లాంటి శాఖాహారాలు చికెన్ మటన్ లాంటి మాంసాహారాలు బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇలా ఏవైనా సరే స్పైసీగా ఉండాలంటే గరం మసాలా జోడి చేస్తాము ఒక్క చెంచా వేస్తే చాలు అద్భుతమైన రుచి వచ్చేస్తుంది ఇంత ముఖ్యమైన గరం మసాలా కొనకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగంటే కడాయిలో అరకప్పు జీలకర్రను వేయించి ఒక పళ్లెంలోకి తీయాలి సగం జాజికాయ మిరియాలు లవంగాలు యాలకులు రెండు చెంచాలు చొప్పున నాలుగు బిర్యానీ ఆకులు అంగుళామంతా దాల్చిన చెక్కలు మూడు చాపత్రికి కొద్దిగా స్టార్ మొగ్గలు బ్లాక్ కారడమములు మూడు చొప్పున తీసుకొని వీటిని కూడా వేయించి మంచి వాసన వస్తున్నప్పుడు జీలకర్ర ఉన్న పళ్లెంలోకి తీయాలి అదే కడాయిలో అరకప్పు ధనియాలు నాలుగు ఎండుమిర్చిలను వేయించాలి వాటిని కూడా తీసి రెండు చెంచాలు సోంపు వేయించాలి అన్ని వేయించడం అయ్యాక చల్లారనిచ్చే గ్రైండ్ చేయాలి అంతే గుమగుమలాడే గరం మసాలా తయారైపోతుంది దీనిని తడి లేని గాలి చొరబడని సీసాలో భద్రం చేస్తే చాలా నాళ్ళు నిల్వ ఉంటుంది



No comments:

Post a Comment