Sunday, 3 March 2024

అనంతమైన అమ్మ ప్రేమ

 జీవితం పూల పాన్పు కాదు జీవితంలో కష్టసుఖాలను ఎదుర్కొని పైకొచ్చిన వారు చాలామంది ఈ మాటని అంటుంటారు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ పుట్టుకతోనే దేశంలోని అత్యంత సంపన్నుల ఇంటి బిడ్డ ఆయన అనంత అంబానీ ఈ మాటని అనడం మాత్రం ఆశ్చర్యమే ముకేశ్ అంబానీ చిన్న కుమారుడైన అనంతం బాని ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా గుజరాత్ లోని జామ్ నగర్  జరుగుతున్నాయి కళ్ళు చెదిరే దేదీప్యమానమైన వెలుగు జిలుగులు ఆడంబరాలే కాదు ఆ వేడుకలలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు అంతులేని భావోద్వేగాలు ఆచారాలు సంప్రదాయాలు సైతం కనబడుతున్నాయి

అనంత అంబానీ చాలా సందర్భాలలో అతని అధిక బరువు కారణంగా వార్తలలోనూ సోషల్ మీడియాలోనూ కనబడుతున్నాడు పెళ్లి అనుకో అనుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో అతనిపై ఎన్నో రకాల పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు కనబడుతున్నాయి చాలామంది వ్యక్తులు సోషల్ మీడియా కారణంగా తమ అధికారి నెగిటివ్ ఇమేజ్ లో ఇరుక్కుపోతున్నారు సెలబ్రిటీలకు ఇది మరింతగా వర్తిస్తుంది అయితే అదే విధంగా కొంతమంది తమలోని నిజ తత్వాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. అనంత అంబానీ విషయంలో ఇది నిజమవుతోంది అతని రూపం పరంగా పలు రకాల ట్రోల్లింగ్ జరిగినా అతను మంచివాడని అంతటి సంపన్నుడైనా ఎంతో వినయంతో ఉంటాడని మెచ్చుకుంటున్నారు కొంతమంది నిటిజన్లు తన ప్రీ వెడ్డింగ్ వేడుకలలో అనంత అంబానీ మాట్లాడిన మాటలు సైతం మరొకసారి అతనిలోని పాజిటివ్ కోణాన్ని ప్రపంచానికి చూపించాయి

అనంత అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం రాత్రి నుండి జరుగుతున్నాయి ఆ వేడుకలలో అతను తనలోని భావోద్వేగాలను వెల్లడిస్తూ మాట్లాడాడు ఎంతో వినయ విధేయతలతో అనంత్ మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది ఆ స్పీచ్ లో అనంతతన తల్లిదండ్రులు ముకేశ్ అంబానీ నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలిపాడు తన జీవితంలో తాను పొందినవి అన్ని తల్లితండ్రుల నుండి సమకూరినవే అని అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు కొడుకు మాటలకు తండ్రి ముకేశ్ అంబానీ కళ్ళు సైతం చమర్చి నాయి

గుజరాత్ లో జరుగుతున్న మూడు రోజుల పై వెడ్డింగ్ వేడుకల కోసం తన తల్లి రోజుకి 18 నుండి 19 పాటు పని చేశారని అతని చెప్పుకొచ్చాడు ఈ ఘనత మొత్తం తన తల్లికి చెందుతుందంటూ తన తోబుట్టువులకు వారి జీవిత భాగస్వాములకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు మీరందరూ పాల్గొని నేను రాధిక ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేశారంటూ వచ్చిన అతిథులకు కూడా ఎంతో వినయంగా కృతజ్ఞతలు తెలిపాడు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమని కూడా కోరాడు ముఖ్యంగా తన ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధని వారి ఇచ్చిన ధైర్యాన్ని చెప్పి అక్కడున్న వారిని కూడా భావోద్వేగానికి గురి చేశాడు. ఈ సందర్భంలోనే ఆనంద తన జీవితం పూల పాన్పు కాదని తాను ముళ్ళ తాలూకు బాధని ఎంతో భరించాలని తెలిపాడు. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నాను కానీ మా అమ్మ నాన్న ఎప్పుడూ నేను ఆ బాధని గుర్తించని స్థితిలో ఉండేలా ధైర్యం చెప్పారు వాళ్లు నిరంతరం నాకు అండగా నిలిచారు నేను ఏదైనా అనుకుంటే చేయగలను అని నమ్మకాన్ని నాలో పెంచారని అనంత చెప్పుకొచ్చాడు ఆరోగ్యం సరిగా లేని బిడ్డలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖేష్ నితా అంబానీ విజయం సాధించి అలాంటి తల్లిదండ్రులు స్ఫూర్తిని నింపారు అని చెప్పవచ్చు




No comments:

Post a Comment