బేకింగ్ సోడా చాలా ఇళ్లలో ఉండేది మైసూర్ బజ్జీలు పొంగడానికి బిస్కెట్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ బేకింగ్ సోడాతో చాలా ఉపయోగాలు ఉన్నాయి
ఫ్లవర్ వాజ్లో నీరు పోసి ఒకటే స్పూన్ బేకింగ్ సోడా వేసి అందులో పూలను కాడలతో ఉంచితే అవి తాజాగా ఉంటాయి నీటి నుంచి నిలువ వాసన కూడా రాదు.
వంట పాత్రల్లో వేడినీరు పోసి అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి కాసేపు నానబెట్టి కడిగితే పాత్రలు మురికి పోయి తల తలలాడతాయి
పాత్రలకు ఉళ్లి వెల్లుల్లి లాంటి పదార్థాల వాసన పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దితే సరి
బేకింగ్ సోడాను తడిచేసి ఆ పేస్టు తో ఫ్రిడ్జ్ ని తుడిస్తే లోపల ఉన్న దుర్వాసన పోతుంది ఒక చిన్న గిన్నెలో ఈ పేస్టును ఫ్రిజ్లో ఉంచితే చెడు వాసన ఏర్పడదు
బేకింగ్ సోడా కలిపిన నీటితో పనులు కూరగాయలను కడిగితే వాటి మీద ఉండే రసాయనాలు మురికి పోతాయి

No comments:
Post a Comment