Wednesday, 6 March 2024

ఐదు నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు

 వైద్య సాంకేతిక రంగంలో ఏఐజీ మరో విప్లవం తవాకరణ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి బృందం వెల్లడి

వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటర్రాలజీ ఏఐజి దవాఖాన మరో విప్లవం సృష్టించింది ఆసియా పసిఫిక్ లోనే తొలిసారిగా వివాస్కోప్ అనే సరికొత్త ఇన్స్టంట్ పెథాలజీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సాధారణంగా బయాప్సీ ఫలితాలు రావాలంటే కనీసం ఐదు రోజుల సమయం పడుతుంది కానీ వీవాస్కోపు పద్ధతి ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు తెలుసుకోవచ్చని ఏఐజి దావాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు వివాస్కోప్ ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడారు వివాస్కోప్ ద్వారా బయాప్సీ ఫలితాలను కేవలం ఐదు నిమిషాల్లోనే తెలుసుకోవచ్చని దీని వలన సరైన సమయంలో రోగ నిర్ధారణ జరిపి రోగికి సకాలంలో చికిత్స అందించే వీలు ఉంటుందని తెలిపారు జిఐ క్యాన్సర్ కు సంబంధించిన అత్య వసర పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ పద్ధతి కీలకపాత్ర పోషిస్తుంది అని తెలిపారు డైరెక్టర్ డాక్టర్ జివి రావు పేతాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ వివాస్కోపు పద్ధతి వైద్యరంగంలో కొత్త శకాన్ని నిర్వహిస్తుందని వేగవంతమైన బయాప్సీ ఫలితాలతో స్పష్టమైన వ్యాధినిర్ధారణ ఆపరేషన్ థియేటర్లోనే చికిత్స ప్రణాళికపై నిర్ణయం తీసుకునేలా వైద్యులకు తగిన సమాచారం అందుతుందని చెప్పారు



No comments:

Post a Comment