కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం లో ఈనెల 23న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జైపాల్ రెడ్డి అనిల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అండర్ 14 16 18 బాలబాలికల విభాగాలలో 400 మీటర్ల పరువు పందెం నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు త్వరలో హైదరాబాద్లో నిర్వహించే 400 మీటర్ల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పాల్గొంటారని తెలిపారు ఆసక్తి గల క్రీడాకారులు పుట్టిన తేదీ దృవీకరణ పత్రంతో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు
No comments:
Post a Comment