హైదరాబాద్ బుక్ ఫెయిర్ అసోసియేషన్
తెలుగు భాషకు పట్టం కడుతూ అన్ని భాషలకు ప్రాధాన్యం కల్పిస్తూ హైదరాబాదులోని గంగా జమున తహసీబ్ సంస్కృతికి నిలువుటద్దంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిలిచిందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ అన్నారు ఫిబ్రవరి 9 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో జరిగే పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు ఈ పుస్తక ప్రదర్శనలో పంచుకోవాలని జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని అన్నారు సామాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూలూరు మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగల శక్తి పుస్తకానికి ఉందన్నారు భావితరాల్ని తీర్చిదిద్దే శక్తి తరగతి గదికి ఉందని మకిలి పట్టిన సమాజం బూజు దులిపే పనిముట్లుగా పుస్తకాలు ఉపయోగపడతాయని రచించిన విశ్వాసంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ దశాబ్ద కాలంగా ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బుక్ ఫైర్ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి కోయ చంద్రమోహన్ కోశాధికారి పీ రాజేశ్వరరావు సహాయ కార్యదర్శి శోభన్ బాబు కార్యవర్గ సభ్యులు కవి యాకూబ్ జనార్ధన్ గుప్తా బాల్రెడ్డి శ్రీకాంత్ మాటూరు సూర్యనారాయణ పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి