17, ఫిబ్రవరి 2024, శనివారం

ఆధ్యాత్మిక సమాచారం ఫిబ్రవరి 17 2024

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం సుప్రభాత సేవ గణపతి హోమం క్షీరాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పట్నం రమేష్ ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్ అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షుడు శ్రీను ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్ శ్రీను పిప్పిరి శ్రీను మోతుకూరి శ్రీను వీరమల్లి శ్రీను శ్రీధర్ తదితరులు ఉన్నారు

తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం ఘనంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు ఉదయం పూజా కార్యక్రమాలు జరిపారు అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగించారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అప్పారావు నరసరాజు రాంబాబు మేనేజర్ విటల్ అర్చకుడు నందకిషోర్ ఉన్నారు

శ్రీవారి ఆలయానికి విరాళం తెలంగాణ తిరుమల ఆలయానికి శుక్రవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు ఒడిశా రాష్ట్రం బరగడ గ్రామానికి చెందిన దాసరి శ్యామ్ హైదరాబాద్ కొంపల్లికి చెందిన రాజు ఒక్కొక్కరు 25వేల రూపాయలు చొప్పున మొత్తం 50,000 విరాళం ఇచ్చారు దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పారావు మురళి వీరయ్య ఉన్నారు

నాగిరెడ్డిపేటలో బంజారా తండా గ్రామంలో శుక్రవారం ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం గణపతి కలశపూజ యజ్ఞం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు సాయి ప్రకాష్ శర్మ కృష్ణ శర్మ రూప్ గ్ భక్తులు పాల్గొన్నారు

నసురుల్లాబాద్ మండలం సైన్యంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో శుక్రవారం శాస్త్రవేత్త పైడిల్లారెడ్డి తో పాటు స్థానిక భాజపా నాయకులు భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు

భక్తి మార్గాన్ని ఆచరించాలి అని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో భక్తి మార్గంలో ప్రయాణించాలని సద్గురు చంద్రశేఖర్ మహారాజ్ తెగులుర్ పేర్కొన్నారు చిన్న కొడంగల్ రామలింగేశ్వరాలయంలో నవనాథ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం ఏకాదశ రుద్రాభిషేకం గోపాలకాల కీర్తన నిర్వహించారు కాలకీర్తనకు ఆయన హాజరై భక్తులను ద్వేషించే ప్రసంగించారు తొలుత భక్తులు కలశాలు నిండు బిందెలు తులసి చెట్టును తలపై పెట్టుకుని భజనలతో ఊరేగింపు చేపట్టారు భక్తులు స్వామివారి దర్శనం పొందారు. అనంతరం మంగళహారతులు అందుకొని తీర్థ ప్సాదం అన్న ప్రసాదం స్వీకరించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి