17, ఫిబ్రవరి 2024, శనివారం

ఎన్నారై పెళ్లిళ్లకు కొత్త చట్టం

 విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఎన్నారై లతో వివాహాలకు సంబంధించి అనేక మోసాలు జరుగుతుండడంపై లా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వివాహిత మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ తరహా వ్యవహారాల కట్టడికి పకడ్బందీ నిబంధనలతో సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఈ మేరకు రూపొందించిన నివేదికను లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రిటైర్డ్ రీతురాజ్ అవస్తి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘాలకు అందజేశారు ఇవి ప్రధాన సిఫారసులు

ఎన్నారై ఓసిఐ లతో భారత పౌరులకు జరిగే వివాహాలను మన దేశంలో నమోదు చేయడానికి తప్పనిసరి చేయాలి కొత్త చట్టంలో విడాకులు భాగస్వామికి భరణం పిల్లల సంరక్షణ వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలి చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు వారెంట్లు జారీ చేయడం న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలను చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. 1967 పాస్పోర్ట్ చట్టానికి సవరణలు చేసి వైవాహిక స్థితి మేటర్ స్టేటస్ ని బహిర్గతం చేయడంతో పాటు జీవిత భాగస్వాముల రెండు పాస్పోర్ట్లను అనుసంధానం చేసేలా నిబంధనలు తీసుకురావాలి జీవిత భాగస్వాముల ఇద్దరి పాస్పోర్ట్లపై వివాహ నమోదు సంఖ్య ఉండేలా చూడాలి వివాహ నమోదు సంఖ్య ఎన్నారైల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతోపాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుంది దంపతుల రికార్డులు హోం శాఖ విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఉండాలి ఇదే వివరాలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉండాలి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి