Sunday, 3 March 2024

నీటి లోపల నిఘాకు మెరైన్ రోబో

 నీటిలోపల నిఘా కోసం ఐఐటి మండి ఐఐటి పలకాడకు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు సముద్ర జలాలు ఇతర నీటి వనరులలో అక్కడికి సైతం చేరుకొని పనిచేసేలా ఈ రోబోను రూపొందించార

ప్రస్తుతం సముద్రంలో నీటిలోపల మీద అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికం ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిగా అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పనిచేస్తుందని ఐఐటి మందిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీష్ కడియం తెలిపారు మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాలలో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పులు కూడా తగ్గించవచ్చు అని ఆయన తెలిపారు మెరైన్ రోబో ద్వారా జల విద్యుత్ కేంద్రాలలో నీటి లోపల నిర్మాణాలను పరిశీలించవచ్చని పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటి పాలక్కాడ్ ప్రొఫెసర్ శాంత కుమార్ మోహన్ తెలిపారు ఈ మెరైన్ రోబో కు సంబంధించిన వివరాలు ఇంటెలిజెంట్ అండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నలలో ప్రచురితమైనాయి.



No comments:

Post a Comment