Sunday, 10 March 2024

కిడ్నీలను పదిలంగా కాపాడుకోవాలంటే

 డయాబెటిస్ హైబీపీ ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉన్నవారు మూడు నెలలకు ఒకసారి హెచ్డీ ఏ వన్ సి పరీక్షలు చేయిస్తూ రీడింగ్స్ 6.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హైబీపీ ఉన్నవారు తమ బిపిని 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి రక్తంలో కొవ్వులు కొలెస్ట్రాల్ పెరగడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం తక్కువగా తీసుకుంటూ శాఖాహారం ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. మన ఆహారంలో ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి ఉప్పు ఎక్కువ మోతాదులో ఉండే బేకరీ ఐటమ్స్ పచ్చళ్ళు అప్పడాలు నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి ఆక్సలైట్స్ ఎక్కువగా ఉండే గింజ ధాన్యాలు సోయాబీన్స్ చాక్లెట్ లాంటి వాటిని తగ్గించాలి క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే కాల్షియం సిట్రేట్కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది నిమ్మ జాతి పనులు ఆరెంజ్ జ్యూస్ వంటి వాటిని డాక్టర్ల సూచనలు మేరకు తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి. పొగ తాగడం పూర్తిగా మానేయాలి ఆల్కహాల్ వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళవలసి వస్తుంది దానితో దేహంలో నీళ్లు తాగి డిహైడ్రేషన్కు గురవుతాయి ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది. ఏవైనా మందులు లేదా విష పదార్థాలు ఒంట్లోకి రాగానే వాటిని విరిచేసి వడపోసి బయటకు పంపే బాధ్యతలు కాలేయం కిడ్నీలవే నొప్పి నివారణ మందుల వంటి కొన్ని అవసరాలు దీర్ఘకాలంలో కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా ఏ రకమైన హాన్ కౌంటర్ డ్రగ్స్ వాడకూడదు మూత్రం ఇన్ఫెక్షన్స్ ని సరైన పద్ధతిలో సరైన మందులతో సరైన సమయంలో వైద్యం చేయించుకుని పూర్తిగా తగ్గెలా చూసుకోవాలి

No comments:

Post a Comment