భక్తిశ్రద్ధలతో బోనాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గొల్లవాడలో ఎల్లమ్మకు మహిళలు మంగళవారం బోనాలు తీశారు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు
శివ శివరామ మందిరంలో కలశ పూజ
దోమకొండ శివరామ మందిరంలో గంగ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవారం కలిసి పూజ నిర్వహించారు జెడ్పిటిసి తిరుమల గౌడ్ ఆలయ ఈవో ప్రభు అధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్ ధర్మకర్తలు లింగారెడ్డి చిన్న రాజయ్య నర్సింలు సిద్ధ రాములు తిరుపతి పాల్గొన్నారు
వైభవంగా విశ్వశాంతి మహా యజ్ఞం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్లో విశ్వశాంతి మహా యజ్ఞాన్ని మంగళవారం నిర్వహించారు సాధు పరిషత్ ప్రతినిధి కృష్ణానంద స్వామి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు భక్తులు కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు
అఖండ హరినామ సప్తాహ ప్రారంభం
పెద్ద కోడప్పగల మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం కాటేపల్లి భజన మండలి అధ్యక్షుడు పిట్టల మహారాజ్ ఆధ్వర్యంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమం నిర్వహించారు 37 గ్రామాల నుంచి భజన మండలిలు పాల్గొంటారని ఆయన తెలిపారు
ఆలయ అభివృద్ధికి విరాళం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పురాతన వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణకు భక్తుడు తాటిపాముల కృష్ణమూర్తి మంగళవారం ఐదువేల ఒక్క రూపాయల విరాళం అందజేశారు
14 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈనెల 14 నుంచి 19 వరకు వేల్కూరు శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు మంగళవారం శ్రీవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసే తీర్థ ప్రసారం స్వీకరించారు అనంతరం బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు కృష్ణారెడ్డి రాజు శరత్ సత్యనారాయణ మేనేజర్ విటల్ అర్చకుడు నందకిషోర్ పాల్గొన్నారు


No comments:
Post a Comment