Wednesday, 13 March 2024

16 నుంచి మల్లికార్జున స్వామి ఉత్సవాలు

 దోమకొండ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు 16న శనివారం సాయంత్రం ఐదు గంటలకు గంగ భవనం 17న ఆదివారం రాత్రి మంద గంపలతో ఊరేగింపు 18న సోమవారం శ్రీ మల్లన్న స్వామి గొల్ల కేతమ్మ మేడాలమ్మల కళ్యాణం రేణుక ఎల్లమ్మ మునిరాజుల కళ్యాణం మధ్యాహ్నం అన్నదానం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో నేత్ర నాగరాజు యాదవ్ కట్ట లక్ష్మణ్ యాదవ్ సిరబోయిన ప్రవీణ్ యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ ఎల్లయ్య యాదవ్ రమేష్ యాదవ్ లింగం యాదవ్ పరిసరం యాదవ్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment