ప్రకటన చూసో ఫ్రెండ్స్ చెప్పారనో మార్చే ఉత్పత్తుల్లో షాంపూ కూడా ఒకటి. మీరు తరచూ ఇలాగే చేస్తుంటారా.. మరి ఈ తీరు మంచిదేనా.. అంటే కొంతమంది చూడండి.. ఒకసారి వేరే షాంపుతో తలస్నానం చేస్తే చాలు జుట్టంతా ఊడిపోతుంది అంటారు. ఒకేదాన్ని తలకు అలవాటు చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. అందుకే వేరేవి అలవాటు చేయాలి. అలాగని తరచూ మారుస్తున్నా సమస్యనే ..తల పొడి బారడం,దద్దుర్లు వగైరా ఇబ్బంది పెడతాయి.
ఈ షాంపు పడట్లేదు ..రెండు మూడు సార్లు వాడగానే ఈ నిర్ణయానికి వచ్చేస్తారు చాలామంది. కొత్తదానికి అలవాటు పడటానికి మాడుకి కాస్త సమయం పడుతుంది.. కాబట్టి వాడిన రోజే ఫలితం కనిపించాలన్న తొందర వద్దు.. కానీ ఏ నిర్ణయానికి రావద్దు..
మాటిమాటికి షాంపూలు మారిస్తే మాడు పై చర్మం లో పీహెచ్ స్థాయిలు పడిపోతాయి ..సహజ నూనెల ఉత్పత్తిలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితమే తలలో ఏక్ని చుండ్రు దురద వంటి సమస్యలు.. అంతేకాదు కురులు నిర్జీవంగా తయారవుతాయి. కాబట్టి కొనేముందే అవసరాలను ఒకసారి గమనించుకోండి. ఒక్కోసారి కాలాన్ని బట్టి చూడ్రు. కురులకు వేసిన రంగు పోకుండా ఉండడం వంటి ప్రత్యేక కారణాల రీత్యా అవసరాలు మారుతుంటాయి ..అలాంటప్పుడు మార్చవచ్చు ..అయితే ఎంచుకున్నది ఏదైనా కృత్రిమ పరిమళాలు సల్ఫేట్లు పారబెన్స్ లేని రకాల కే ప్రాధాన్యమిస్తే మంచిది..
No comments:
Post a Comment