క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా సంస్కార భారతి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఉగాది కవితా సంకల్నాన్ని తీసుకువస్తున్నట్లు ఇందుకోసం ఆసక్తిగల కవుల నుంచి కవితల ఆహ్వానిస్తున్నట్లు కార్యాధ్యక్షులు గంట్యాల ప్రసాద్ కార్యదర్శి చామకూర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు బుధవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో బాలరాముడు కొలువైన సందర్భాన్ని పురస్కరించుకొని అయోధ్య వైభవం పేరుతో కవితా సంపుటిని ముద్రిస్తున్నామన్నారు కవితలు 18 పంక్తులకు మించరాదని అంశానికి తగిన విధంగా ఉండాలన్నారు ఉగాది రోజున వచ్చే నెల 9న సంపుటిని ఆవిష్కరిస్తామని అన్నారు కవితలను ఈనెల 25 లోగా చరవాణి సంఖ్యలు 9440356306 మరియు 9959740505 కు పంపించాలని అన్నారు
No comments:
Post a Comment