రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు టికెట్ బుక్ కాకపోయినా ఖాతాలో నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి ఇలాంటి అప్పుడు రిఫండ్ కోసం ఇప్పటిదాకా మూడు నాలుగు రోజులు వేచి చూడాల్సి వచ్చేది ఇకపై గంటా లేదా కొన్ని గంటల్లోనే వినియోగదారుకు నగదు వెనక్కి వచ్చేలా ఐఆర్సిటిసి ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అంతా ఆన్లైన్ లో జరుగుతున్నప్పుడు రిఫండ్ల జారీలో ఆలస్యం ఎందుకని ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు అన్ని రకాల రిఫండ్లకు ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రిఫండ్ల జారీలో ఆలస్యాన్ని ఘననీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలను ఏడాది జనవరిలోని ఆదేశించింది ఆ క్రమంలోని ఐఆర్సిటిసి ఈ సంస్థకు ఐటి సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నాయి
No comments:
Post a Comment