రైలు ప్రమాద బాధిత పెయింటర్కు మహిళ చేతులు ఢిల్లీలోని శ్రీ గంగారం ఆసుపత్రి ఘనత
రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఒక పెయింటర్కు ఢిల్లీలోని శ్రీ గంగారాం హాస్పిటల్ వైద్య బృందం కొత్త జీవితాన్ని ప్రసాదించింది శాస్త్ర చికిత్స ద్వారా ఒక మహిళ చేతులను విజయవంతంగా అమర్చింది ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన రాజకుమార్ 45 ఏళ్ల వయసు పెయింటర్ గా పనిచేసేవాడు 2020లో సైకిల్ పై రైల్వే పట్టాలు దాటుతుండగా అదుపుతప్పి పడిపోయాడు అదే సమయంలో రైలు దూసుకు రావడంతో రెండు చేతులు తెగిపడ్డాయి అతడికి కృత్రిమ చేతులను వినియోగించడం కూడా సాధ్యపడలేదు శ్రీ గంగారాం హాస్పిటల్కు 2023 ఫిబ్రవరిలో చేతుల మార్పిడి శస్త్ర చికిత్సకు అనుమతుల్లభించాయి రాజకుమార్ గురించి తెలుసుకున్న వైద్య బృందం అతడికి చేతుల మార్పిడి సాధ్యాసాధ్యులపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తూ రిటైర్ అయిన ఒక మహిళ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో ఆ మహిళ చేతులను జనవరి 19న రాజ్ కుమార్ కు విజయవంతంగా మార్చారు ప్రస్తుతం అతడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చేతులను వేళ్లను కదిలించగలుగుతున్నాడని పైతీలు ఒక ప్రకటనలో వెల్లడించారు దీంతో మళ్ళీ అతడి జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి గురువారం అతడిని డిశ్చార్జ్ చేయనున్నారు ఇటీవల ఎడమ చేతిని కోల్పోయిన ఒక వ్యక్తికి హర్యానాలోని అమృత ఆసుపత్రిలో సర్జరీ చేసి మరొకరి అవయవాన్ని అతికించారు
No comments:
Post a Comment