Saturday, 2 March 2024

ఇళ్లన్నీ మహిళల పేరు మీదే

 బాకాపూర్ మహారాష్ట్రలో 2000 గడపలున్న ఒక చిన్న గ్రామం ఊరు పెద్దలు తీసుకొచ్చిన ఒక మార్పు ఎంతో మంది ప్రశంసలు అందుకుంది అదేమిటంటే సాధారణంగా ఇల్లు మగవారి పేరు మీద ఉండడం చూస్తుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం ఊళ్లో ప్రతి ఇల్లు ఆ ఇంటి మహిళల పేరు మీదనే ఉంటుంది మగవారి పేరు మీద ఉండాల్సి వస్తే కోనరుగా మహిళ తప్పనిసరి అట ఇంటి ముందు నేమ్ ప్లేట్ పై యజమాని పేరు మహిళది. గతంలో వ్యసనాలకు బానిస అయిన కొందరు మగవాళ్ళు ఇంటిని అమ్మేయాలని ప్రయత్నించడంతో ఇతర కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనివలన మహిళలకు ఇంటిపై హక్కు మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత ఉంటుందని భావించారట ఇప్పుడు భాకాపూర్ లో ఎవరైనా ఇంటిని కొనాలన్న అమ్మాలన్న అందుకు ఆ ఇంటి మహిళల అనుమతి తప్పనిసరి



No comments:

Post a Comment