కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో దట్టమైన అటవీ క్షేత్రంలో కొండా కోనల మధ్య బుగ్గ ఆలయం వెలసింది సాక్షాత్తు శ్రీరాముడు వనవాసంలో సైకతలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్లు భక్తుల నమ్మకం బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే చిరకాల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రికి లక్షల సంఖ్యల స్వామిని దర్శించుకుంటారు దాతలు గ్రామస్తుల సహకారంతో ఆలయంలో నిత్యాన్నదానం వృద్ధాశ్రమం గోశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు
వృద్ధులకు ఆశ్రయం వృద్ధులకు అనాథ వృద్ధులకు ఆలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 35 మంది వరకు వృద్ధులు ఉంటున్నారు వీరికి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉదయం రాత్రి భోజనం పెట్టి దుస్తులు ఇతర సామాగ్రి అందజేస్తారు వృద్ధులు మరణిస్తే అంత్యక్రియలను సైతం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆలయా ఆవరణలోని గోశాలలో 85 గోవులను పోషిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు బుగ్గ ఆలయంలో పలు కార్యక్రమాలు చేయడానికి భక్తులు గ్రామస్తులు సహకారం మరువలేనిది గత 23 ఏళ్లుగా నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతోంది ఆలయ పునరుద్ధరణకు దాతలు పెద్ద సంఖ్యలు ముందుకు రావాలి అని ఆలయ అర్చకుడు ప్రభాకర్ స్వామి అన్నారు నిరుపేదలకు చేయూత అందించేందుకు కృషి చేస్తున్నాం గ్రామస్తులు దాతల సహాయంతో అనాధలకు ఆశ్రయం కల్పిస్తున్నాం మహాశివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోవాలి అని ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు
23 ఏళ్లుగా నిత్యాన్నదానం బుగ్గ ఆలయంలో 2001 నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక సంచి బియ్యాన్ని అందజేస్తారు తొలిత కిలో నుంచి ప్రారంభించి ప్రస్తుతం నిత్యం 50 కిలోల వరకు అన్నదానం చేస్తున్నారు సోమవారం రెండు క్వింటాల బియ్యం అన్నదానం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
నేటి నుంచి వేడుకలు ప్రారంభం ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముంబారంగా కొనసాగుతున్నాయి గురువారం రోజున అఖండ దీపారాధన రాత్రి పల్లకి సేవ గ్రామంలో ఊరేగింపు ఉంటుంది శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటలకు అగ్నిగుండాలు రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
No comments:
Post a Comment