ఐదున మహిళా దినోత్సవం సందర్భంగా శారీవాకతాన్
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ఈ నెల రెండు నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ జాతీయ స్థాయి సాంస్కృతిక వేడుకలు జరుగుతాయి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతివృత్తంతో దేశ సంస్కృతి సంప్రదాయాలు వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రానున్న తరాలకు వాటిని అందించేలా కార్యక్రమాలు నిర్వహించడమే దీని ముఖ్య ఉద్దేశము దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు తమ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆఖరి రోజున మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శారీవాకతాన్ జరుగుతుంది ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల మహిళలు వారి ప్రాంతాలలో ధరించే చీరకట్లతో పాల్గొంటారు అని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు
No comments:
Post a Comment